టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి!వీడియో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య  పరస్పరం దాడులకు దారితీసిన ఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్ లో చోటుచేసుకుంది. బోధన్‌లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ ఇమ్రాన్‌ షరీఫ్‌కు కాంగ్రెస్‌ అభ్యర్ధి మీర్‌ ఇలియాజ్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 32వ వార్డులో  దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగారు. వీరిద్దరి మధ్య గొడవ  తారాస్థాయికి చేరడంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలియాజ్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ ముక్కు కొరికేశాడు. బాధితుని ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహ్మద్‌ ఇమ్రాన్‌ షరీఫ్‌ను స్థానిక ఎమ్మెల్యే షకీల్‌ పరామర్శించారు…