PUBG ఆడుతున్నాడా ( PUBG వాలా హై క్యా ).

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తప్పించుకునే టిప్స్ చెప్పేందుకు ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చా 2.O’తో ఈ రోజు వారి ముందుకొచ్చారు.
ఓ మహిళ తన కొడుకు ఆన్ లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని ప్రధాని మోడీకి కంప్లెయింట్ చేసింది. దీంతో వెంటనే PUBG ఆడుతున్నాడా (PUBG వాలా హై క్యా) అని అడిగారు.

మోడీ నోట ఆ మాట రాగానే పిల్లలంతా ఉత్సాహంగా గట్టిగా అరిచారు. అయితే ప్రధాని మోడీ ఒక్క క్షణం ఆగి… పిల్లాడికి, తల్లికీ.. సలహాలిచ్చారు. పిల్లల్ని టెక్నాలజీ నుంచి దూరం చేయొద్దని, వారు టెక్నాలజీలో ఏ వైపు ఆసక్తిగా ఉన్నారు? ఏ విషయాలను తెలసుకుంటున్నారన్నది గమనించి ప్రోత్సాహించాలని ఆ పిల్లాడి తల్లికి సూచించారు మోడీ. కానీ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోకూడదని, దాని సాయంతో అభివృద్ధి చెందాలే తప్ప జీవితాన్ని నాశనం చేసుకోకూడదని ఆ విద్యార్థికి చెప్పారు. టెక్నాలజీలోనూ పాజిటివ్, నెజటివ్ రెండూ ఉన్నాయని, దాని నుంచి కొత్త ఆవిష్కరణలు చేసేలా పిల్లల్ని తల్లిదండ్రులే గైడ్ చేయాలని సూచించారు.

Updated: January 29, 2019 — 6:46 pm