జియో బంపర్ ఆఫర్.. ఉచితంగా 10జీబీ మొబైల్ డేటా

జియో మార్కెట్లోకి అడుగుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తాజాగా రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. my jio యాప్‌లోకి వెళ్లి.. My plans ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. మొత్తం 10జీబీ డేటాను ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఉచితంగా పొందనున్నారు.