వరదల్లో చిక్కుకున్న గర్భిణీని కాపాడిన నేవీ సిబ్బంది.. వీడియో

దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా వరదల్లో ప్రసవ వేధన పడుతున్ననిండు గర్భినిని రక్షించి హాస్పటల్ కి తరలించిన వైనం సోషల్ మీడియాలో వైరలైంది. కోచి ప్రాంతానికి చెందిన సజిత అనే గర్భిణికి శుక్రవారం మధ్యాహ్నం పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.కనుచూపు మేరలో అంతా నీటిమయం కావడంతో ఆమెలో ఆందోళన మొదలైంది.కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి..వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. హెలికాప్టర్ సాయంతో ఆమెను కాపాడి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు వైద్యులకు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు…

 

Updated: December 2, 2018 — 3:53 pm