మీది MI ఫోనా అయితే రూ.లక్ష వరకు లోన్ పొందండి ,ఇలా అప్లై చేసుకోండి!

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ఎంఐ క్రెడిట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు రూ.1 లక్ష వరకు లోన్లను పొందవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్రమే ఈ యాప్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇక ఇందులో ఎంఐ అకౌంట్ ఉన్నవారు లేదా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకుని తమ కేవైసీ వివరాలతో లోన్ పొందవచ్చు. రూ. లక్ష దాకా పర్సనల్‌‌‌‌ లోన్స్‌‌‌‌ను ఎంఐ క్రెడిట్‌‌‌‌ ఇస్తుందని షియోమి ఇండియా మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ మను జైన్‌‌‌‌ తెలిపారు. 2023 నాటికి ఇండియాలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ లెండింగ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 1.9 కోట్ల మంది కస్టమర్లు రూ. 4 లక్షల కోట్ల విలువైన పర్సనల్‌‌‌‌ లోన్స్‌‌‌‌ తీసుకున్నారన్న సిబిల్‌‌‌‌ రిపోర్టును ఆయన  ఈ సందర్భంగా ఉదహరించారు ప్రస్తుతం పూర్తి స్థాయిలో దీన్ని లాంచ్ చేశామని, 18 సంవత్సాలకు పైబడి వయస్సు ఉన్నవారు తమ కేవైసీ వివరాలతో లోన్ పొందవచ్చని, వడ్డీ 1.35 శాతం వరకు ఉంటుందని షియోమీ తెలిపింది. ఇక తీసుకున్న రుణం మొత్తాన్ని 91 రోజుల నుంచి 3 ఏళ్ల లోపు వినియోగదారులు చెల్లించవచ్చని షియోమీ తెలియజేసింది.