పిల్లలకు ప్రేమతో మినీ ఆటో తయారుచేసిన నాన్న

పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు అడుగుతారు కదా!… అలాగే తమ పిల్లలు ముచ్చటపడ్డారని… వారికోసం ఓ ఆటోనే తయారుచేసి ఇచ్చాడు. కాకపోతే అది చిన్న ఆటో. చిన్నదే కానీ.. పెద్ద ఆటోలాగే ఇది కూడా.. స్టార్ట్ చేయగానే రోడ్డుపై పరుగెడుతుంది.

చిన్నప్పుడు తన తండ్రిని కారు కావాలని అడిగాడట అరుణ్. కార్పెంటర్ అయిన తండ్రి…ఆర్థిక స్తోమత సరిపోక.. ఓ చెక్కబండి తయారుచేసి ఇచ్చాడట. అప్పుడు తన తండ్రి తనకు గిఫ్ట్ ఇచ్చినట్టుగానే.. తాను కూడా తన పిల్లలకు అడిగిన ఆటోను ఇవ్వాలని డిసైడయ్యాడట. వారికి పనికొచ్చేలా… ఏడు నెలలపాటు కష్టపడి.. వేరే వాహనాలు, డిష్ యాంటెన్నాలు, చైన్లు లాంటి విడిభాగాలతో.. ఈ మినీ ఆటోను తయారుచేశాడు. ఈ మినీ ఆటోను నడుపుతూ… తన ఐదేళ్ల కొడుకు మాధవ్, కూతురు కేతిని హ్యాపీగా ఉన్నారు.. అది చాలు అంటున్నాడు అరుణ్ కుమార్.  ఈ మినీ ఆటో విశేషాలను ఆయన తన యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేశాడు.