నడిరోడ్డుపై యువకుడిని వెంబడించి కొట్టిన బాలయ్య? (వీడియో)

హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణమరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ వెంటపడి మరీ కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలయ్య.. నడిరోడ్డుపై అందరూ చేస్తుండగానే.. ఓ యువకుడి మీద దాడి చేశారు. ఈ వీడియోను వైఎస్ఆర్సీపీ కూడా ట్వీట్ చేసింది. రోడ్డు మీద ఓ యువకుడిని బాలయ్య వెంబడించి మరీ కొట్టడం కనిపించడం ఆ వీడియోలో కనిపించింది. బాలయ్య వెంటపడుతుంటే, ఆ యువకుడు పరిగెత్తాడు. కానీ బాలయ్య అతడి వెంట పరిగెత్తి మరీ దాడి చేశాడు. 

Updated: April 8, 2019 — 11:51 am