దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్‌నగర్‌ వద్ద ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారి ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు.

ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురు తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. కాల్పులు జరిపక తప్పలేదని.. నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఎన్‌ కౌంటర్ జరిగింది.

Updated: December 6, 2019 — 8:07 am