అరవింద సమేత అందుకే వదులుకున్నా.. హీరోయిన్ లయ

స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయ్యమయింది లయ. మొదటి సినిమాతోనే తన అందం,అభినయం తో ఆకట్టుకుంది లయ.ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయి.లయ అప్పట్లో వరుస సినిమాలతో తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలు మానేసి,దూరంగా ఉంటోంది తెలుగు సినిమాల్లో మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపించే హీరోయిన్లే అరుదు. అలాంటి అరుదుగా ఉన్న హీరోయిన్లలో… తన నటనతో మెప్పించిన స్టార్ లయ. స్వయంవరం చిత్రంతో వెండితెరకు పరిచయమైన లయ… ఏడెనిమిదేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజిగా ఉండేది. కానీ ఆ తర్వాత సినిమాలు తగ్గిపోవటం పైగా ఓ అమెరికా సంబంధం రావటంతో పెళ్లి చేసుకోని అమెరికాలో సెటిల్ అయిపోయింది లయ.

కానీ తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం… లయకు అరవింద సమేతలాంటి పెద్ద చిత్రంలో ఓ క్రూషియల్ రోల్ ఇచ్చారట. ఎక్కువ సేపు ఉండే పాత్రతో పాటు, మంచి పాత్ర కూడా. కానీ తన పాత్రలో నవీన్ చంద్రకు తల్లిగా, జగపతిబాబుకు భార్యగా చేయాల్సిన క్యారెక్టర్. ఇప్పుడే తను అక్క, అమ్మ పాత్రలా అంటూ లయ వెనక్కి తగ్గటంతో ఆ పాత్ర ఈశ్వరీరావు చేశారు ఇండస్ట్రీ మర్చిపోతున్న సందర్భంలో… అక్క, అమ్మ పాత్రలు కాకుండా మళ్లీ హీరోయిన్ పాత్రలు ఎలా వస్తాయనుకుందో లయ…!